కేరళ లో కూడా కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. సౌత్ లో మిగితా రాష్ట్రాలన్నీ ఎప్పుడో ఈ మార్క్ ను క్రాస్ చేయగా తాజాగా కేరళ కూడా ఈజాబితాలో చేరింది. గత కొన్ని రోజుల నుండి కేరళ లో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. టెస్టులు కూడా ఎక్కువ చేస్తుండడం తో రోజు అధిక సంఖ్యంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా  40కేసులు నమోదు కాగా అందులో 30 విదేశాల నుండి వచ్చినవారివి కాగా మరో 10 కాంటాక్ట్ కేసులు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  1003 కి చేరగా అందులో 552 మంది బాధితులు కోలుకొని 6గురు మరణించారు. ప్రస్తుతం 445కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. 
 
ఇక గడిచిన 24గంటల్లో 6,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా 194 మరణాలు సంభవించాయి. ఈకేసుల తో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 158,333 కు చేరగా అందులో 67692 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 4531 మంది మరణించగా ప్రస్తుతం 86110కేసులు యాక్టీవ్ గా ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: