ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకునేది ఆయన కుమారుడు హరికృష్ణ గురించి. హరికృష్ణ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి కూడా ఎన్టీఆర్ కి తోడుగా ఉన్నారు. ఎన్టీఆర్ కి ప్రతి అడుగులో కూడా అన్ని తానై వ్యవహరించి తన వంతుగా సహాయ సహకారాలను అందించారు. ప్రచారం చేసినా ఏది చేసినా సరే హరికృష్ణ లేకుండా ఎన్టీఆర్ రాజకీయం అనేది ఉండేది కాదు అప్పట్లో. ఆ విధంగా హరికృష్ణ ను ఎన్టీఆర్ ఆదరించారు. ప్రతీ విషయం కూడా హరికృష్ణ చేతుల మీదుగానే జరిగింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ ప్రతీ విషయాన్ని హరికృష్ణ కు చెప్పే చేసేవారు. 

 

అలా ప్రతీ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ అన్నీ తానై వ్యవహరించారు. చైతన్య రధం తో హరికృష్ణ వేల కిలోమీటర్లు  ప్రచారం లో ఎన్టీఆర్ తో కలిసి పాల్గొన్నారు అప్పట్లో. ఆ విధంగా తండ్రికి అండగా నిలిచారు. కొడుకులు ఋణ పడిన తండ్రులు ఉంటారు గాని తండ్రి రుణ పడిన కొడుకు ఆయన ఒక్కడే అని అంటారు. ఇప్పటికి కూడా చాలా మంది నాయకులు తమ రాజకీయ ప్రస్తానంలో హరికృష్ణ ను తలుచుకుంటూ నే ఉంటారు. హరికృష్ణ దగ్గర రాజకీయం నేర్చుకున్న వారు చాలా మంది నేటి రాజకీయాల్లో ఉన్నారు. 

 

ప్రచారంలో హరికృష్ణ లేకుండా ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళే వారు కాదు. ప్రతీ ఒక్కటి కూడా హరికృష్ణ దగ్గర ఉండి చూసుకునే వారు. వేల కిలోమీటర్లు తండ్రి పక్కన తిరిగారు హరికృష్ణ ఆ విధంగా తన తండ్రికి సహకరించారు. ఇక పిల్లలను కూడా ఆయన ఒకానొక సందర్భంలో పట్టించుకోలేదు ఎన్టీఆర్ కోసం అని చెప్తూ ఉంటారు చాలా మంది. ఆ విధంగా హరికృష్ణ ఎన్టీఆర్ తో ఉండే వారు అని తండ్రి రాజకీయ నిర్ణయాలు తప్పు అయినా సరే ధైర్యంగా చెప్పే వారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: