దేశం అంతా ఇప్పుడు కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా ఉంది.  మనిషికి మనిషికి దూరాన్ని పెంచింది.. కరోనా పేరు చెబితే చాలు ఆమడ దూరం వెళ్తున్నారు.  అయితే కరోనాని నిర్మూలించాలంటే మనం ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలి, మాస్క్ తప్పని సరి... ఎవరైనా తుమ్మినా, దగ్గినా చాలా దూరంగా ఉండాలి. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పట్టున ఉండే ప్రయత్నం చేయాలి.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  అయితే కరోనా వల్ల సామాన్య ప్రజలు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు.  ఉన్నవారు.. డబ్బు దాచుకున్న వారు పరిస్థితి ఎలా ఉన్నా.. దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

 

 ఇలాంటి వారి కోంస స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం,సెలబ్రెటీలు ముందుకు వస్తున్నా.. అది పూర్తి స్థాయిలో పేదలకు అందుతాయా అన్నది ప్రశ్న? అయితే ఓ చిరు వ్యాపారి నేను సైతం అంటూ తన ఉదారతను చాటుకున్నాడు. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లో కూర‌గాయ‌ల వ్యాపారి ఇచ్చిన ఆఫర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారు అతడు ఏర్పాటు చేసిన బోర్డును చూసి ఆసక్తిగా వెళ్తున్నారు. ‘వీలైతే కొనండి, లేకపోతే ఉచితంగా తీసుకోండి’ అంటూ కూరగాయల బండికి రాసిపెట్టి చాలా మందికి అండగా నిలుస్తున్నాడు. రాహుల్ ల‌బాడే అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల లాక్‌డౌన్ కారణంగా జీతాలు ఇవ్వకపోవడంతో తండ్రితో పాటు కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.

 

ఈ క్రమంలో అతడి వద్దక ఓ రోజు వృద్ధురాలు వచ్చి రూ. 5కు కూరగాయలు ఇవ్వమని కోరింది. అయితే ఆ ధరకు ఏమి రాకున్నా ఆమె పేదరికాన్ని అర్థం చేసుకొని ఉచితంగా ఇచ్చి పంపాడు. ఆ తర్వాత డబ్బు లేక కష్టపడుతున్న వారి కోసం ఉచితంగా కూరగాయలు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. తడు వెంటనే తన బండికి ఓ బోర్డు రాసి పెట్టాడు. ‘వీలైతే కొనండి.. లేకపోతే ఉచితంగా తీసుకెళ్లండి’ అంటూ పేర్కొన్నాడు.  డబ్బు ఉన్నవారు కొంటున్నారు.. పేద వారికి ఉచితంగా ఇస్తున్నాడు. రాహుల్ చేస్తున్న పనికి పలువురు అభినందనలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: