ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరు అయినా ఏ స్థాయిలో ఉండే వారు అయినా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యులు ఎప్పుడు అయితే పరిపాలనలో అడుగు పెడతారో అక్కడి నుంచి రాజకీయాలు మారతాయి. పరిపాలన విషయంలో సున్నితంగా వ్యవహరించాలి. కాని ఎన్టీఆర్ ఈ విషయంలో కొన్ని శక్తులకు అప్పుడు అవకాశం ఇచ్చి విమర్శల పాలు అయ్యారు అనే వ్యాఖ్యలు ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటాయి. లక్ష్మీ పార్వతి విషయంలో ఆయన తక్కువ అంచనా వేసారని అంటారు. 

 

ఇక్కడ ఆమెను విమర్శించడం అని కాదు గాని లక్ష్మీ పార్వతి పార్టీలో ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారు అని చాలా మంది అప్పట్లో వ్యాఖ్యలు చేసారు. ఆమె అలా మారడం తోనే నాయకులకు స్వేచ్చ లేకుండా పోయింది అని చాలా మంది కామెంట్స్ చేసారు. పదవి కావాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆమె పెత్తనం ఎక్కువగా ఉండటమే పార్టీని బాగా ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ ని ఆమె డ్యామేజ్ చేసారనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయంగా కూడా ఆమె జోక్యం చాలా ఇబ్బంది పెట్టింది అంటారు. 

 

నమ్మకంగా ఉన్న చంద్రబాబు లాంటి నాయకులు అందుకే దూరం అయ్యారు అని కొందరు అప్పట్లో వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న చాలా మంది నాయకులు ఆయనను దూరం పెట్టడానికి లక్ష్మీ పార్వతి అతి జోక్యమే అని అంటారు.  ఎన్టీఆర్ కూడా ఆమె విషయంలో ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు అని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది అనేది చాలా మంది చెప్పే మాట. అయితే కొంత మంది మాత్రం లక్ష్మీ పార్వతి విషయంలో ఎక్కువగా ఊహించుకుని ఆమెను ఇబ్బంది పెట్టారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: