ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం పార్టీని స్థాపించడం అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కావడం వంటివి నిజంగా సంచలనమే. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రతీ ఒక్కటి ఏ విధంగా సంచలనమో... ఆయనను కాంగ్రేస్ పార్టీ ఇబ్బంది పెట్టాలి అని భావించడం కూడా ఒక సంచలనమే అనేది చాలా మంది చెప్పే మాట. అవును అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా ఉంది. నాయకులు అందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వారే. తెలుగుదేశం పార్టీ రావడం తో ఒక్కసారిగా కాంగ్రెస్ ఇమేజ్ మసకబారింది. 

 

ఇదే ఎన్టీఆర్ ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టడానికి కారణం అయింది. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు అప్పుడు బలంగా వీచేలా చేసాయి. జనతా పార్టీ సహా కొన్ని పార్టీలు  కాంగ్రెస్ ని బాగా ఇబ్బంది పెట్టాలి అని చూసాయి. రాజకీయంగా బలంగా ఉన్న ఇందిరా గండి ఎన్టీఆర్ ని చూసి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను ప్రత్యేకంగా చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పరిపాలించిన సమయంలో మావోయిస్ట్ దాడులు చాలా తీవ్రంగా జరిగాయి అని అంటారు. 

 

అవును ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఏటూరు నాగారం సహా కొన్ని చోట్ల పెద్ద పెద్ద దాడులు చేయించింది అని వందల మంది  పోలీసులు అందులో బలైపోయారు అని అంటారు. ఎన్టీఆర్ ని బలహీన నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం మావోల ద్వారా కాంగ్రెస్ చేసినా సరే ఎన్టీఆర్ మాత్రం వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. హెచ్ జే దొర లాంటి వారి ద్వారా ఆయన మావోలను ఎదుర్కోవడంలో చాలా సమర్ధవంతంగా వ్యవహరించారు అని చెప్తూ ఉంటారు. ఎన్టీఆర్ ని కాంగ్రెస్ వారి ద్వారా ఇబ్బంది పెట్టాలని చూసినా క్రమంగా మావోలు కూడా ఎన్టీఆర్ ని అర్ధం చేసుకున్నారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: