జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో ఎదురులేని హీరోగా కొనసాగాడు. కానీ రాజకీయ రంగంలో పెద్ద అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయాడు. అయితే సినిమాకి రాజకీయానికి చాలా వ్యత్యాసం ఉంటుందని పవన్ కళ్యాణ్ గ్రహించలేక పోతున్నాడు. సినిమా హీరోకి చేతిలో స్క్రిప్ట్ ఉంటుంది. ఎవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం తన ప్రిపేర్ అవుతాడు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. తానే స్వయంగా స్క్రిప్టు రాసుకోవాలి, దాని పద్ధతిగా ఆచరణలో పెట్టాలి. టైమింగ్ అస్సలు మిస్ అవ్వకూడదు. కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు. 


అర్చకులకు, పాస్టర్లకు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే వారికి అక్షరాల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం గా ఇస్తున్నామని వైయస్సార్సీపి ప్రభుత్వం వెల్లడించింది. వారిని గమనించి, వారి కోసం నగదు కూడా ఇచ్చే నిర్ణయం వైసిపి పార్టీ తీసుకున్న రెండు మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో గంభీరమైన ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో అర్చకులను, పాస్టర్లను ఆదుకోవాలని చాలా పొడుగూతా రాశారు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ వేల వేల పుస్తకాలు చెబుతాడు కానీ ఒక్క వార్త పేపర్ కూడా చదవడని స్పష్టమవుతుంది. అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ వాయించడం అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా అని వైసిపి పార్టీ నేతలు అతన్ని వెటకారం ఆడారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తర్వాత తానే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న జనసేన పార్టీ నేత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనీసం తెలుసుకోకపోవడం బాధాకరమని చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే తాను పార్టీ పెట్టాను అన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యవహార తీరు ఉందని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. తాను రొటీన్ విమర్శలు చేయాలని మొదటిలో చెప్పాడు కానీ ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు సోషల్ మీడియా ఖాతాల పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఆవేశపడే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద పొరపాట్లు చేస్తున్నారని అనే వాళ్ళు ఉన్నారు. పరిపాలన చేస్తున్న నాయకుడు మంచి పనులు చేస్తే అతడిని పొగిడితే పవన్ కళ్యాణ్ పై విశ్వసనీయత పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అది తప్ప మిగతా అన్ని విమర్శలను ప్రభుత్వ నేతలపై రుద్దుతూ తనకు తానే నష్టం చేకూర్చేకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: