దేశంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరుకుంటారు.. కానీ నీతి నిజాయితీగా పనిచేస్తే ఈ కాలంలో మన కుటుంబం గడవడమే కష్టం. అందుకే కొంత మంది కేటుగాళ్ళు అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ జల్సా చేస్తున్నారు. ఇందుకోసం హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా, బెదిరింపులు ఇలా ఎన్నో క్రైమ్స్ చేస్తున్నారు.  దేశ వ్యాప్తంగా ఎంతో మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆడవారు, యువతులు కొంత మంది దళారుల చేతుల్లో మోసపోతుంటారు.. ఇంటికి వెళ్లలేక ఇక్కడే వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్నారు.. అలాంటి వారితో కోట్లు గడిస్తున్నారు నేరగాళ్ళు.  అమ్మాయిలను ఉద్యోగాలు ఇప్పిస్తామని ట్రాప్ చేసి వారిని లొంగదీసుకొని వారిచే వ్యవభిచారం చేయిస్తున్న గుట్టు రట్టయ్యింది. అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.  అనంతపురం రూరల్  పరిధిలో పద్మావతి  అలియాస్ దస్తగిరమ్మ అనే మహిళ నివసిస్తోంది.

 

తన ఇంటికి సమీపంలోని ఉండే ఒక యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో  ఉండటం ఆమె గమనించింది. ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకుంది. ప్రొద్దుటూరులో తనకు తెలిసిన వారు ఉన్నారని, అక్కడికొస్తే వారిద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని భవిష్యత్ లో అది మంచి ఉద్యోగం అవుతుందని.. ఎక్కువ సాలరీ వస్తుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన ఆ యువతి.. రెండు నెలల క్రితం  ఇంట్లో ఎవరికీ చెప్పకుండా  పద్మావతి  వెంట  ప్రొద్దుటూరు వెళ్లింది. విషయం తెలియని కుటుంబ సభ్యులు తమ కుమార్తె కనిపించటంలేదని అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

ఉద్యోగం ఇప్పిస్తానని ప్రొద్దుటూరు తీసుకు వెళ్లాక పద్మావతి మాట మార్చింది. ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుందని.. వ్యభిచారం చేసుకుంటే కావాల్సినంత సంపాదన వస్తుందని ఆశ చూపింది.  కానీ ఆ యువతి ససేమిరా అనడంతో ఓ రూమ్ లో బంధించింది. ఎలాగో అలా తప్పించుంది. అప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావటంతో ప్రొద్దుటూరులో చిక్కుకుపోయింది.  యువతి ఆచూకి తెలుసుకున్న త్రీటౌన్ సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో యువతిని అనంతపురం తీసుకువచ్చారు. పద్మావతి పై  ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: