హైదరాబాద్ వాసులకు ఎప్పటినుండో చుక్కలు చూపిస్తున్న సమస్య ట్రాఫిక్ సమస్య. ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ హైవే లు ఇలా నిత్యం హైదరాబాదులో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ నియంత్రణ లో ఫలితం శూన్యం. ఉదయమైన, మధ్యాహ్నమైనా తెల్లవారి మొదలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. మామూలు రోజుల్లోనే ఓ రేంజ్ లో ఉండే ట్రాఫిక్ జాములు వర్షం పడితే మాత్రం ప్రయాణికుల సహనానికి పరీక్షలే. అటువంటిది కరోనా వైరస్ కారణంగా ఇటీవల లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేయటంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు సరికొత్త టెక్నాలజీతో చెక్ పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవల ప్రభుత్వాలు ఆంక్షలు సడలింపులు మెల్ల మెల్లగా ఎత్తి వేస్తున్న తరుణంలో హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య తో ప్రయాణికులు చిక్కుకుపోయే విధంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయిన తరుణంలో కిక్కిరిసిపోయే విధంగా ట్రాఫిక్ లేకుండా దేశంలో ఎక్కడా లేని సరికొత్త టెక్నాలజీ డీప్ లెర్నింగ్ పద్దతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అసరాగా చేసుకొని రోడ్ల మీదకు వచ్చే వాహనాలు సైతం భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో రద్దీ ప్రాంతాలను ఆన్లైన్ లో కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు.

 

ఆయా రహదారిలో ఉన్న కెమెరాల ద్వారా లైవ్ లో కంట్రోల్ రూమ్ లో పరిస్థితిని చూస్తూ భౌతిక దూరాన్ని పాటించని వాహనాలను గుర్తించ బోతున్నారు. ఈ విధానం ద్వారా హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. సో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలతో చిక్కుకుపోయిన వారికి ఇది ఒకలాంటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: