ఇటీవల మెదక్ జిల్లా పాపన్నపేట మండలం, పోడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగునీరు కోసం 120 అడుగుల తవ్విన బోరు బావిలో సాయి వర్ధన్ అనే మూడేళ్ల బాలుడు పడటం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు టెక్నీషియన్లు చేసిన రెస్క్యూ టీం వలన బాలుడు చనిపోవటం అతని తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. గురువారం ఉదయం ఈ ఆపరేషన్ ముగియడంతో అప్పటికే  ప్రాణాలు కోల్పోవడంతో సాయి వర్ధన్ మృతదేహాన్ని పట్టుకొని తల్లిదండ్రులు బోరున విలపించారు. మరోసారి అధికారులు బోరు బావిలో పడిన పిల్లవాడి ప్రాణాలను కాపాడటం లో విఫలం అయ్యారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలలో ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా పరిష్కార మార్గాలు కనిపెట్టక పోవటం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఉన్న కొద్దీ ప్రమాదాలు జరుగుతున్నాయి తప్ప పట్టలేని అధికారుల తీరు పట్ల జనాలు అసహనం చెందుతున్నారు.

 

ఎక్కడికక్కడ బోరుబావులు వేయటం నీళ్లు రాకుంటే వదిలివేయటం పరిపాటిగా మారిపోయింది. ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిసినా తమకి ఎందుకులే అనే నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. లక్షల కోట్ల టెక్నాలజీ అంటూ తెగ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని ఇప్పటివరకు సీరియస్ గా తీసుకోకపోవటం బట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చుక్కనీరు ఉండదు నోరు తెరుచుకుని ఉంటాయి. ఎక్కడికక్కడ జనావాసాల మధ్య పంట పొలాల్లో ఎలా పడితే అలాగా చిన్నారులను మింగేందుకు రెడీగా ఉంటాయి. అటువంటి నిరుపయోగ బోరుబావుల విషయాల్లో ప్రమాదాలు రోజురోజుకి చోటుచేసుకుంటున్న ప్రభుత్వాలు ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా సరికొత్త టెక్నాలజీ తీసుకురావాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇలాంటి సంఘటనలు విదేశాలలో జరిగితే అక్కడ రెస్క్యూ టీం కేవలం రెండు గంటల్లోనే పని పూర్తి చేసి సమస్యను పరిష్కరించటం జరుగుతుందట. మరి ఇక్కడ ఉన్నా ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్లు టెక్నాలజీ అంటూ తెగ గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీసం ఒక బిడ్డను కాపాడాలని పరిస్థితిలో వ్యవస్థ ఉందని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బోరుబావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సరైన పరిష్కారం ప్రభుత్వాలు చూడాలని ప్రజలు కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: