విశాఖపట్నంలో జరిగిన ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఎంత నష్టాన్ని కలిగించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ అనే కంపెనీ నుండి ప్రమాదవశాత్తు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్టెర్లిన్  అనే విష వాయువు వెలువడడం.. క్షణాల్లోనే చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడం... దీంతో ఎంతో మంది ఎక్కడికక్కడ ఈ వాయువును  పీల్చుకుని  కుప్పకూలి పోవడం లాంటివి చూస్తుండగానే జరిగిపోయాయి. ఈ ఘటనలో ఏకంగా 13 మంది మృత్యువాత పడ్డారు.ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు వదిలాయి.  ఈ ఘటనలోని  బాధితులను మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకునే విషయం తెలిసిందే. 

 


 అయితే దేశంలోనే మొదటి సారి స్టెర్లిన్  గ్యాస్ లీక్ అవ్వడం.. భారీ నష్టాన్ని కలిగించటంతో...  అటు జాతీయ మానవ హక్కుల కమిషన్,  పర్యావరణ కమిటీ... రాష్ట్ర ప్రభుత్వం నియమించిన  కమిటీ దర్యాప్తు చేస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ సంస్థకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనే దానిపై అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు ఎల్జి పాలిమర్స్ అనే కంపెనీకి ఉచ్చు బిగుసుకుంటోంది. ఎందుకంటే ఎల్జి పాలిమర్స్ అనే కంపెనీకి ఇప్పటి వరకు అసలు పర్యావరణ అనుమతులు లేవు అని తాజాగా కమిటీల విచారణలో తేలింది. 

 


 ఇప్పటికే మూడు కమిటీలు ఎల్జీ  పాలిమర్స్ ఘటనపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ ఘటనకు గల కారణం ఏమిటి.. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమా  లేకపోతే ఏదైనా లోపమా... సరైన అనుమతులు ఉండే కంపెనీ నిర్వహిస్తున్నారా  లేదా ఎలాంటి అనుమతులు లేకుండానే కంపెనీ నడుస్తుందా అనే విషయాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా ఎల్జి పాలిమర్స్ కంపెనీ పర్యావరణ అనుమతులు లేవు అన్నది తాజాగా స్పష్టమైంది. దీంతో ఎల్జి పాలిమర్స్ కంపెనీకి క్రమక్రమంగా ఉచ్చు బిగుసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: