ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ అటు  భారత దేశంపై కూడా పంజా విసురుతుంది. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని ప్రాణ భయంతో వణికిస్తోంది  ఈ మహమ్మారి వైరస్. ఇప్పటికే ఏకంగా భారతదేశంలో ఒకటిన్నర లక్షలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా మారిపోయింది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రూపంలో కరోనా వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో రోజు రోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఊహించని విధంగా ఇక్కడ ముగ్గురు కరోనా  వైరస్ బారిన పడ్డారు. 

 

 ఇప్పటికే కరోనా  వైరస్ రకరకాలుగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే... కొంతమందికి దగ్గు తుమ్ముల కారణంగా ఎదుటి వ్యక్తి ద్వారా విస్తరిస్తే... మరి కొంత మందికి కొన్ని వస్తువుల ద్వారా ఈ మహమ్మారి వైరస్ వ్యాపిస్తున్న  విషయం తెలిసిందే. అయితే తాజాగా సిగరెట్ ద్వారా ముగ్గురికి కరోనా  వైరస్ వ్యాప్తి చెందింది. మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ధూమపానానికి అలవాటుపడి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూత్ లో అయితే సిగరెట్ తాగడం అనేది  ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారంటే ఒక సిగరెట్ ని ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకరు తాగిన తర్వాత ఇంకొకరు అతని తర్వాత మరొకరు ఇలా తాగుతూ ఉంటారు. 

 

 ఇలా సిగరెట్ షేర్ చేసుకోవడమే ఇక్కడ వీరికి శాపంగా మారిపోయింది. సిగరేట్  కారణంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హైదరాబాద్ జియాగూడ లో కరోనా  వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. అంత్య  క్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత షాద్ నగర్ లో ఉన్న తన స్నేహితులతో కలిసి సిగరెట్ తాగాడు . ముగ్గురు స్నేహితులు ఒక సిగరెట్ ని షేర్ చేసుకున్నారు. కాగా ఆ తర్వాత ముగ్గురు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ముగ్గురుని  క్వారంటైన్  కు తరలించారు అధికారులు. కాగా ఇప్పటివరకు షాద్ నగర్ లో ఏకంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: