ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు చిత్రవిచిత్రంగా ఏదో విధంగా జనాలను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా ఎంతో మంది యువతులకు మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కాజేసే వాళ్లు కూడా ఎక్కువై పోతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా పరిచయమైన వ్యక్తులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తున్నప్పటికీ... కేటుగాళ్ల చేతిలో జనాలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏకంగా ఫేస్బుక్ కారణంగా పరిచయమైన వ్యక్తి ఓ మహిళ వద్ద ఏకంగా 38 లక్షలు కాజేశాడు. 

 


 వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు కొన్నాళ్ళ క్రితం ఓ యువకుడితో ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇక తన పేరు హెర్మన్ అని లండన్లో డాక్టర్ గా పనిచేస్తున్నాను అంటూ సదరు యువకుడు ఆ మహిళతో.. మాయమాటలు చెప్పి క్రమక్రమంగా ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు.  ఆ తర్వాత చాటింగ్ చేయడం కాల్ మాట్లాడడం జరిగిపోయింది. ఈ క్రమంలోనే సదరు మహిళకు ఒక ఖరీదైన బహుమతిని పంపిస్తా అంటూ మాయమాటలు చెప్పాడు సదరు వ్యక్తి. ఇక ఈ విషయం నిజమే అనుకొని నమ్మింది సదరు మహిళ. ఇంతలోనే ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారిని  అంటూ ఫోన్ చేసి మీకు ఒక బహుమతి వచ్చిందని...  అందులో డాలర్లు  ఉన్నాయని దీనికి టాక్స్ చెల్లించాలి అంటూ  చెప్పుకొచ్చాడు. 

 

 సదరు వ్యక్తి మాటలు నమ్మిన మహిళ అతను అడిగిన టాక్స్ లు  అన్ని చెల్లించింది.  ఇలా వివిధ రకాల టాక్స్  పేరు చెప్పి ఏకంగా సదరు మహిళ నుంచి 38 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసాడు. ఇక ఆ ఖరీదైన బహుమతి వస్తుంది అని ఆ మహిళ ఎంతగానో ఎదురు చూసింది . కానీ ఎంతకీ గిఫ్ట్ మాత్రం రాకపోవడంతో అనుమానం వచ్చిన సదరు మహిళ... వెంటనే అతని ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది .దీంతో  జరిగిన స్టోరీ మొత్తం అర్థం చేసుకుంది సదరు మహిళ. తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: