తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేత నందమూరి తారక రామారావు జయంతిని తెలుగు ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నందమూరి కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మహానాడు లోని మహానేత ఎన్టీఆర్  చిత్రపటానికి చంద్రబాబు నాయుడు పూల మాల వేసి నివాళులు అర్పించారు... ఆ వెంటనే మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది అంటూ వ్యాఖ్యానించారు.. అయితే తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా చంద్రబాబు పై  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో నలుగురిని మంత్రులను చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది అంటూ ప్రశ్నించారు. 

 


 ఆనాడు పార్టీ ఫిరాయింపుల కు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆ విషయాన్ని ఇప్పుడు మరిచిపోయారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు రోజా. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన నగరి ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల గురించి కూడా చెప్పుకొచ్చారు నగరి ఎమ్మెల్యే రోజా. రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినంత మేలు.. ఇప్పటివరకు ఎవరూ చేయలేదు అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రోజా. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  ఏడాది కూడా తిరక్కుండానే ఏకంగా పది వేల కోట్ల రూపాయలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాము అంటూ గుర్తు చేశారు. 

 

 ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నది  అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రోజా. నాని ఫెస్టివల్ లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో 33 పథకాలు ప్రవేశపెట్టారని అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని... 33 పథకాలకు కనీసం ప్రజలు 33 సీట్లు కూడా ఇవ్వకుండా ఛీ  కొట్టారు అంటూ విమర్శించారు. ప్రజలు అంత దారుణంగా చంద్రబాబును తిరస్కరించినప్పటికీ ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు అని... వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: