ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా హాట్ హాట్ గా నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ఇక రేపోమాపో టీడీపీ నుంచి మరో ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి షాక్ ఇచ్చి ఫ్యాన్ కింద సేదతీరేందుకు రెడీ అవుతున్నారు అన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

 

గత మూడు నాలుగు రోజులుగా ఈ వార్తలు హల్ చల్ చేస్తున్న టిడిపి అధిష్ఠానం కానీ... సదరు ఎమ్మెల్యేలు గానీ వీటిని బలంగా ఖండించ‌లేని పరిస్థితి నెలకొంది. ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరం అయ్యారు. వీరిలో ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం... గుంటూరు జిల్లా నుంచి రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ఉన్నారు.

 

ఇక కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం ఎందుకు రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో పార్టీ మారతారని ఎమ్మెల్యే ల్లో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మినహా మిగిలిన వారికి ప్రసంగించే అవకాశం రాలేదు. అయితే చివరి రోజు సాయంత్రం లోపు అయినా అన‌గాని వ‌స్తారా ?  లేదా ? అన్నది కూడా సందేహమే. మరోవైపు మహానాడులో పలువురు కీలక నేతలు సైతం మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడతారని చర్చించుకున్న పరిస్థితి.

 

ఇదే విషయాన్ని వారు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకు వెళ్ళగా... ఆయన సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేమని నిట్టూర్పు ఇచ్చినట్టు సమాచారం. సో ఏదేమైనా టీడీపీ లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే ఎమ్మెల్యే లు పార్టీ వీడి వెళుతున్నా వారిని కనీసం ఆపే ప్ర‌య‌త్నం కూడా లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: