తన కూతుళ్లను కాపాడాలంటూ కువైట్ దేశంలో ఉన్న ఒక మహిళ ఒక ప్రముఖ ఛానల్ కు సెల్ఫీ వీడియో ని  పంపించడం జరిగింది.  తన ఇద్దరు కూతుర్లను ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ ఓ కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను పంపించడం జరిగింది. తాను బతుకు తెరువు కోసం కువైట్ దేశానికి ఉపాధికోసం వస్తే... భారత్ లో ఉన్న తన ఇద్దరు కూతుర్ల పై పెట్రోల్ పోసి తగలబెడతాం అని ఇద్దరు యువకులు బెదిరిస్తున్నారని వారి నుంచి తన కూతుళ్లను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో పంపించడం జరిగింది కన్నతల్లి.

IHG

ఇక ఈ  విషయం పూర్తి పూర్తి వివరాలలోకి వెళితే... తూర్పు తూర్పుగోదావరి జిల్లా  అమలాపురంలో ఈ సంఘటన జరిగింది.  తన కూతుర్లని ప్రేమించాలని ఇద్దరు యువకులు గతకొద్దికాలంగా వెంటపడుతున్నారు అని అందులో తెలియజేసింది. అయితే ఈ విషయంలో ఆ యువతులు వారి వేధింపులు భరించలేక అమలాపురం నగరంలోని టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయించారు. కేసు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు యువకులను పోలీసులు వదిలేశారు. ఆ తర్వాత బయటకు వచ్చాక తన కూతుర్లను పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరించారని ఆవిడ చెబుతోంది.

IHG

 

ఇక తన కూతుర్లు దిక్కుతోచని స్థితిలో ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ మళ్ళి అదే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం జరిగింది. అలా జరిగినా పోలీసులు వారిని అసలు పట్టించుకోవట్లేదు అని, కాబట్టి నా కూతుర్లను ఎలాగైనా కాపాడండి అని సెల్ఫీ వీడియో ప్రముఖ ఛానల్ కు పంపింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: