ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని దుకాణ సముదాయాలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మినహా మిగతా అన్ని దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. ఇక పలు చోట్ల ఏకంగా రవాణా వ్యవస్థ కూడా పునఃప్రారంభం అయ్యింది . అయితే ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత హెయిర్ సెలూన్  లు కూడా తెచ్చుకున్నాయి . అయితే దాదాపుగా 50 రోజులకు పైగా లాక్ డౌన్  కొనసాగడం... హెయిర్ సెలూన్లు మూసివేయడంతో ఎంతోమంది ఎప్పుడెప్పుడు హెయిర్ సెలూన్లు తెరుచుకుంటాయ అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

 


 ఇదే సమయంలో హెయిర్ సెలూన్ తెరుచుకోవడంతో ఎంతో మంది ప్రస్తుతం సెలూన్లకు వెళ్తున్నారు. అయితే అన్ని షాపులలో భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధిస్తున్న  విషయం తెలిసిందే. అయితే మహమ్మారి కరోనా  వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా యంత్రాంగం హెయిర్ సెలూన్ విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఎవరైతే బార్బర్ షాప్ కి వెళ్ళాలి అని అనుకుంటారో... వారు ఎవరి టవల్ వారు తీసుకెళ్లాలి అంటూ నిబంధన విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా బార్బర్ షాప్ నిర్వాహకుడు కత్తెరలు దువ్వెనలను కూడా శానిటైజర్ తో శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

 

 అంతేకాకుండా షాప్ లోకి వచ్చే కస్టమర్ ల మధ్య మూడు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోనే  మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఏకంగా  మహారాష్ట్రలో  45 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం కూడా మహారాష్ట్ర కావటంతో  అక్కడ ప్రభుత్వం కరోనా వైరస్ ను కంట్రోల్ చేయ లేక పోతుంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అక్కడ క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: