గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ ఆస్తులకు సంబంధించిన వివాదం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీటీడీ 50 భూములను వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడం... అందుకోసం కమిటీని ఏర్పాటు చేయడం... అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి, భక్తుల నుంచి నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే. ఆస్తుల అమ్మకం విషయంపై జగన్ సర్కార్ పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

 

అదే సమయంలో జగన్ సర్కార్ ఆస్తుల వేలంను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సర్కార్ ఆ భూములను అధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకునేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా టీటీడీ భూముల గురించి ఒక పిటిషన్ దాఖలైంది. టీటీడీకి లాయర్ గా పని చేసిన బాలాజీ టీటీడీ 50 ఆస్తులు మాత్రమే కాకుండా మరో 23 ఆస్తులు అమ్మడానికి సిద్ధపడిందని పిటిషన్ లో తెలిపారు. 

 

ఈ 23 ఆస్తుల వివాదానికి సంబంధించి తాజాగా చర్చ జరుగుతోంది. ఈ 23 ఆస్తులను టీటీడీ విడిగా అమ్మనుందా...? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే కోర్టు ఈ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకుంటుందా...? మరోసారి ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందా...? ఇప్పటికే 23 ఆస్తుల విషయంలో టీటీడీకి ఎదురుదెబ్బ తగలడంతో వీటి విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.

 

ఈ 23 ఆస్తులకు సంబంధించి టీటీడీ వివరణ ఇస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడి 23 ఆస్తుల అమ్మకాలను ఆపేసి వీటిని కూడా అధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తుందా...? చూడాల్సి ఉంది. వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో టీటీడీ ఖ్యాతి దెబ్బ తింటోంది. ఇలాంటి సమయంలో టీటీడీ ఈ 23 ఆస్తుల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఈ 23 ఆస్తుల విషయంలో జగన్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: