దేశంలో రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రశాంత్ కిషోర్ గురించి తెలిసే ఉంటుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలను ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అధికారంలోకి తీసుకొచ్చారు. పీకే ఎవరి తరపున పని చేస్తే వారు అధికారంలోకి రావడం ఖాయమని చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు పీకే వ్యూహకర్తగా పని చేస్తున్నారు. డీఎంకే పీకేను రంగంలోకి దింపడంతో అన్నాడీఎంకే సునీల్‌ని రంగంలోకి దింపింది. 
 
ప్రశాంత్ కిషోర్ స్థాయిలో కాకపోయినా సునీల్ కు కూడా వ్యూహకర్తగా మంచి పేరే ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపొయినా . పెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. తమిళనాడులో 21 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునీల్ వ్యూహం ఫలించకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. 
 
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న డీఎంకే ప్రశాంత్ కిషోర్‌ను తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోగా స్టాలిన్‌ను సీఎం చేయాలన్న లక్ష్యంతో పీకే ఇప్పటికే పని చేస్తున్నారు. దీంతో అన్నాడీఎంకె సునీల్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. ఇప్పటికే అన్నా డీఎంకేలో ఐటీ విభాగాన్ని ప్రక్షాళన చేసినట్టు సమాచారం అందుతోంది. 
 
అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కరోనా విజృంభణ తగ్గిన తరువాత ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నాయని తెలుస్తోంది. ప్రశాంత్ కిషొర్ ఏపీలో జగన్ గెలుపును చూసి ఆయనను నియమించుకుంది. స్టాలిన్ వర్సెస్ పళనిస్వామి పోటీ పడుతున్న తరుణంలో రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డీఎంకే అధికారంలోకి వస్తే ప్రశాంత్ కిషోర్ ఖాతాలో మరో పార్టీ విజయం నమోదయ్యే అవకాశం ఉంది.                             

మరింత సమాచారం తెలుసుకోండి: