ఇండియా లో వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు ఇటీవల ఇచ్చిన తర్వాత అంతకు ముందు రోజుకి రెండు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా రోజుకి ఐదు వేల నుంచి ఆరువేల లోపు కేసులు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొన్నటి వరకు కంట్రోల్ అయిపోయింది అని భావించిన టైం లో ఒక్కసారిగా కేసులు ఊహించని రీతిలో బయట పడుతున్న తరుణంలో వైద్యుల లోనూ మరియు ప్రభుత్వాలు లోనూ టెన్షన్ నెలకొంది. లాక్ డౌన్ కారణంగా కంటోన్మెంట్ జోన్ లో నుంచి ఎవరిని బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నా మరోపక్క వలస కూలీలు వలన దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి.

 

దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎక్కడికక్కడ నివారణ చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ నగరంలో షాద్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాదులో అంత్యక్రియలకు వెళ్ళాడు. అక్కడ అతనికి కరోనా వైరస్ సోకింది. అయితే ఈ విషయం ఆయనకు తెలియదు. ఆ తర్వాత అతను తిరిగి షాద్ నగర్ వెళ్లి అక్కడ ఓ షాప్ లో సిగరెట్ తాగాడు.

 

సిగరెట్ ని మరో ముగ్గురు తో షేర్ చేసుకున్నాడు.దీంతో ఆ ముగ్గురుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారితో పాటు చాలామంది ఆ టైంలో సిగరెట్ షేర్ చేసుకోవడంతో సిగరెట్ తాగిన వారితోపాటు వాళ్ల కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ లో చేర్చారు. దీంతో ఆశలు సిగరెట్టు ఎక్కడ కొనడం జరిగింది ?, ఇంకా ఆ షాపు వ్యక్తి ఎంతమందికి సిగరెట్ అమ్మేడు అనే వివరాలు సేకరించే పనిలో అధికారులు మునిగితేలారు. దీంతో ఈ వార్త విని హైదరాబాద్ వాసులతో పాటు తెలంగాణ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: