కేరళలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. ఈరోజు కరోనా వల్ల 68 ఏళ్ళ అంజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు అయితే అంజయ్య కేరళ వాసి కాదు తెలంగాణకు చెందిన వ్యక్తి... పనికోసం తెలంగాణ నుండి రాజస్థాన్ కు వలస వెళ్లగా లాక్ డౌన్ వల్ల స్వస్థలానికి చేరాలనుకున్నాడు అయితే పొరపాటున తెలంగాణ కు వెళ్లే ట్రైన్ ఎక్కాల్సివుండగా తిరువనంతపురం వచ్చే ట్రైన్ ఎక్కాడు. అలా తిరువనంతపురం లో దిగిన  అంజయ్యకు కరోనా లక్షణాలు ఉండడం తో ఆసుపత్రిలో చేర్పించగా ఈరోజు మృతి చెందాడని కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.  
 
మరోవైపు కేరళ లో ఈరోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 84 కేసులు బయటపడ్డాయి. అందులో 79 విదేశాల నుండి వచ్చినవారు కాగా 5 కాంటాక్ట్ కేసులు.. ఈకొత్త కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తంకేసుల సంఖ్య 1088కు చేరగా 555 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 7గురు కరోనా వల్ల మరణించగా 526 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా టెస్టులు ఎక్కువ చేయడం లేదని విమర్శలు రావడంతో విజయన్ సర్కార్  గత కొన్ని రోజుల నుండి టెస్టుల సంఖ్య కూడా పెంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: