ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న టైం లోనే హైదరాబాదు తర్వాత అంతటి మహానగరంగా విశాఖ కి మంచి పేరు ఉంది. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా వైజాగ్ ఆవిష్కరించబడింది. ఇదే సమయంలో కేంద్రం కూడా స్మార్ట్ సిటీ గా గుర్తించిన నగరంగా విశాఖ దేశ స్థాయిలో మంచి పేరు సంపాదించింది. ఇదేదో ఇప్పుడప్పుడే అభివృద్ధి చెందిన నగరం కాదు బ్రిటిష్ కాలం నుండి తన ప్రత్యేకతను చాటుకున్న నగరం విశాఖ నగరం. అలాంటి విశాఖ నగరానికి జగన్ అధికారంలోకి వచ్చాక మహర్దశ పట్టింది. విశాఖ పట్టణాన్ని జగన్ సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవటం మనకందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో విశాఖపట్టణం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీస్థాయిలో జగన్ సర్కార్ నిధులు విడుదల చేయడం జరిగింది.

 

దీంతో ఉగాది పండుగ లోపు విశాఖపట్టణానికి రాజధానిని తరలించాలని జగన్ సర్కార్ అప్పట్లో మొత్తం రంగం సిద్ధం చేసుకోంది. అయితే మధ్యలో కరోనా వైరస్ రావటంతో మొత్తం వ్యూహాలు అన్ని తారుమారయ్యాయి. అయితే వైరస్ పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి రావడం తో పాటు ఎదుర్కొనే విధంగా ఏపీ ప్రభుత్వం ఉండటంతో విజయదశమికి విశాఖ రాజధాని స్క్రిప్ట్ జగన్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 25 వ తారీఖున బ్రహ్మాండమైన ముహూర్తం అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు. అప్పటివరకు ముహూర్తాలు లేవని అందువల్ల ఐదు నెలలు వేచి ఉండి ఆ ముహూర్తం కి విశాఖ లో రాజధాని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని స్వామి స్వరూపానందేంద్ర వైసీపీ పార్టీ పెద్దలకు చెప్పినట్లు టాక్.

 

దీంతో రాబోయే విజయదశమికి విశాఖపట్టణానికి రాజధాని తరలించడానికి జగన్ అన్ని విధాలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈలోపు ప్రభుత్వ అధికారులను మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవనాల ఏర్పాట్లు విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని విశాఖ పార్టీ కేడర్ కి జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: