జేసీ దివాకర్ రెడ్డి తెలుగు రాజకీయాలలో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకంటూ బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలపాటు రాజకీయాలు చేసి అనంతపురం జిల్లాలో తనకంటూ మార్క్ కూడా సెట్ చేసుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయంగా ఎంతటివారినైనా ఎదిరించే సత్తా జేసీ లో ఉంటుందని చాలా మంది ఆయన గురించి తెలిసిన వారు అంటుంటారు. ప్రస్తుతం టీడీపీ లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డిపార్టీ అధినేత చంద్రబాబు కే చుక్కలు చూపిస్తున్నారు. బహుశా టీడీపీ లో ప్రస్తుతం ఉన్న నాయకులలో జేసీ దివాకర్ రెడ్డి లాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు లేడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

2019లో టీడీపీ ఓడిపోయాక బహిరంగ సమావేశాలలోనే చంద్రబాబు ముఖం పై వేలు చూపిస్తూ జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని కేవలం రాజకీయ నాయకులకు అదేవిధంగా డబ్బున్న వారికి మాత్రమే నచ్చటం లేదు అంటూ అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంసంచలనం. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా విశ్లేషకుడుగా కూడా జేసీ దివాకర్ రెడ్డి అంచనా చాలా కరెక్ట్ గా ఉంటాయని చాలామంది అంటారు. అయినా గాని సొంత పార్టీ నేత అయ్యుండి ప్రత్యర్ధి పార్టీని పొగడటం పట్ల టిడిపి నాయకుల లోనే జేసీ పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతోంది. కానీ జేసీ దివాకర్ రెడ్డి కి  కౌంటర్ ఇచ్చే దమ్ము మాత్రం టిడిపి పార్టీలో ఎవరికీ లేదు అని చాలామంది అంటున్నారు.

 

కారణం ఉన్నది ఉన్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఉంటున్న క్రమంలో ఆయనకు కౌంటర్ వేసిన అది తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేస్తోంది అని సీనియర్ రాజకీయ నేతలు అంటున్నారు. ఇటీవల అమరావతి దీక్షలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు గురుంచి జేసీ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఏసీ గదుల్లో కూర్చుని చేసే దీక్షలు జగన్ ని అసలు కదిలించలేవని, టీడీపీకి మళ్లీ భవిష్యత్తు రావాలంటే జగన్ ని ఎదిరించాలంటే సగం రాష్ట్రమే కదిలిరావాలని జేసీ దివాకర్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి చేసే కౌంటర్లను సీరియస్ గా తీసుకుని టీడీపీ నాయకులు పునర్ ఆలోచిస్తే అది పార్టీకే లాభమని పొలిటికల్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: