ప్రస్తుతం కరోనా వైరస్ భారతదేశంలో విలయ తాండవం చేస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో అన్ని కూడా అనేక సమస్యలతో అతలాకుతలం అవుతున్నారు. ఈ తరుణంలో అద్దె చెల్లించ లేదన్న కోపంతో దంపతులను కాల్చి చంపేశాడు ఒక వ్యక్తి. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 


ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఆరాంఘర్ అహిరౌల కు చెందిన సంజీవ్ ఓల్డ్ సారీ సిటీలో ఆటో స్పేర్ పార్ట్స్ అమ్మే షాపును నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రాకేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి తీసుకుని నిర్వహిస్తూ ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా షాపులు అన్నీ కూడా మూతపడడంతో చేతిలో డబ్బులు లేక సంజయ్ ఇంటి అద్దె కట్టలేకపోయాడు. ఈ తరుణంలో ఇంటి యజమాని అద్దె ఇవ్వాలి అని ప్రశ్నించాడు. అతడు డబ్బులు లేవు అని తెలియజేయడంతో ఇద్దరీ మధ్య తగాదా మొదలయ్యింది.

 


ఇకపోతే కొంత సమయానికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయ్‌ తుపాకీ తీసుకొని సంజయ్, అతని భార్య ఇద్దరి పై కాల్పులు నిర్వహించాడు. దీనితో స్థానికులు ఘటనని గమనించి హుటాహుటిగా సంజయ్, అతని భార్యని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక వారి ఇద్దరి పరిస్థితి చాలా విషమించడంతో వెంటనే వారిని ప్రవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. దీనితో వారు తీవ్రంగా గాయపడటంతో ఇటీవల మరణించారు.

 

ఈ ఘటనపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఏది ఏమైనా కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంటి అద్దె కట్టాలని యజమాని ఇలా చేయడం చాలా దారుణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: