భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ కేసులలో  దాదాపుగా 50 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలో మాత్రమే ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ అసమర్థత ఏకంగా  దేశానికి శాపం గా మారిపోతుంది. దేశంలోనే అత్యధిక కరోనా  కేసులు అక్కడ నమోదు అవుతున్నాయి అత్యధిక మరణాలు కూడా అక్కడే ఉన్నాయి. దాదాపుగా అక్కడ కరోనా  కౌంట్ 50,000 దాటిపోయింది. ఇక ప్రతి విషయంలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ అసమర్థత బయటపడుతూ వస్తోంది. కరోనా  వైరస్ కట్టడి మాత్రమే కాదు... వలస కార్మికుల తరలింపు విషయంలో కూడా ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుంది. 

 


 వలస కార్మికులు తరలించేందుకు ఐదుసార్లు ప్రయత్నించినప్పటికీ ఐదుసార్లు విఫలమయింది ఉద్దవ్ థాకరే  సర్కార్. అయితే మహారాష్ట్ర లో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు పార్టీలలో సమన్వయ లోపం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మూడు పార్టీల మధ్య నెలకొన్న సమన్వయలోపం ప్రస్తుతం మహారాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారుతోంది. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఒక వింత పిలుపునిచ్చారు. తమ భాగస్వామ్య పార్టీ లను  కరోనా  కట్టడి కోసం చర్చించేందుకు రావాలని పిలుపునిచ్చారు ఉద్దవ్ థాకరే. 

 


 అయితే రాష్ట్రంలో కరోనా  కేసులు వనేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తే బాగుంటుంది ఉద్ధవ్  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. లాక్ డౌన్  సడలింపు ఇవ్వకపోతే రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు వస్తాయి అని శరద్పవార్ వ్యాఖ్యానిస్తున్నారూ . రెండు పార్టీల మధ్య సమన్వయలోపం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. మరోవైపు రోజురోజుకు అక్కడ భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన నగరాలలో న్యూ యార్క్  తర్వాత మహారాష్ట్ర నే  ముందు స్థానంలో ఉన్నది .  మూడు పార్టీల మధ్య సమన్వయ లోపం ప్రస్తుతం భారత ఆర్థిక రాజధానిని  అస్తవ్యస్తం చేస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: