ఈ మధ్య కాలంలో కొత్తగా స్టోరీ లు రాసుకుని సినిమాలు తీయటం కంటే.. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న  సినిమాలు  ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ప్రస్తుతం ఇలాంటి సినిమాలే  ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు . ఇలా  యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు కొత్తగా కథ రాసుకోవాల్సి  ఉండకపోవడం... వాస్తవంగా జరిగిన సంఘటనలు కొన్ని సినిమా హంగులు అద్దితే  సరిపోతుండటంతో  దర్శక నిర్మాతలు ఇలాంటి యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చి  ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. 

 

 అయితే వరంగల్లో జరిగిన ఒక మర్డర్ మిస్టరీ గురించి ఎవరైనా సినిమా తెరకెక్కిస్తారా అన్న టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది. ముఖ్యంగా సంచలనాల దర్శకుడు యదార్థ సంఘటన ఆధారంగా జరిగే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ వరంగల్ మర్డర్  మిస్టరీ గురించి సినిమాలను తెరకెక్కిస్తారూ అనే టాక్  వినిపిస్తుంది. సంజయ్ అనే వ్యక్తి ఒక మహిళ కోసం ఏకంగా 11 హత్యకు పాల్పడ్డాడు. రోజురోజుకు ఈ హత్యల ఉదంతం పెరుగుతూ వస్తోంది. పోలీసుల విచారణ లో సరికొత్త అంశాలు బయట పడుతూనే ఉన్నాయి. 

 


 వరంగల్ గీసుకొండ బావి  డెత్ మిస్టరీ రామ్ గోపాల్ వర్మ ఏమైనా తెరకెక్కిస్తారా  అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. ఎందుకంటే ఈ డెత్ మిస్టరీ లో  ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు హత్యల సంఖ్య పెరిగిపోతుంది. మొదట కేవలం ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు బావిలోంచి బయటపడ్డాయి. ఆ తర్వాత పోలీసులు నీటిని తోడితే మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఓకే బావిలో  తొమ్మిది మృత దేహాలు బయటపడటం  సంచలనంగా మారింది.. ఈ హత్యలకు  సంజయ్ కుమార్ అనే వ్యక్తి కారణం కావడం మరింత సంచలనంగా మారింది. అదే సమయంలో పోలీసులు విచారణలో  మరో రెండు హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా ఇప్పుడు వరకు సదరు వ్యక్తి 11 హత్యలు చేశాడు. ఇలా రోజు రోజుకు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ యదార్థ ఘటనను  రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తారు అనే చర్చ మాత్రం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: