తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మహానాడు మే 27 వ తారీఖున స్టార్ట్ అయినా విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో కాకుండా జూమ్ యాప్ టెక్నాలజీ తో టీడీపీ 2020 మహానాడు నిర్వహిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరియు కీలకమైన నాయకులు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొనడం జరిగింది. మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు నివాళులు అర్పించి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీటీడీ భూముల విక్రయాలు గురించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.

 

ఇదిలా ఉండగా రెండో రోజు జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఇంటి దగ్గరే ఉంటూ జూమ్ యాప్ ద్వారా పాల్గొన్న బాలకృష్ణ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండటం డౌటే అన్నట్టుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా పరిపాలిస్తే రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండదని త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదని బాలకృష్ణ అన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ మీడియా వర్గాలలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

 

కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని బాలకృష్ణ అన్నట్లు టాక్. అదేవిధంగా మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? లేదా ? అన్న అనుమానం వస్తుందని బాలకృష్ణ సందేహం వ్యక్తం చేశారట. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ కన్న కలలను చంద్రబాబు సాకారం చేస్తున్నారని అన్నారు. టిడిపి కార్యకర్తలకు ఎక్కడ అవసరమైతే అక్కడ అందుబాటులోకి వస్తానని బాలయ్య బాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ కి వారసులను తాము కాదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన వారసులు అని బాలకృష్ణ భారీ డైలాగులు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: