ఏపీ సీఎం జగన్ తన ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వించిన జగన్ ఒక్కమాటలో తానేంటో తన పనితీరు ఏంటో తేల్చి చెప్పేశారు. పారిశ్రామిక వేత్తలకు క్లారిటీ ఇచ్చేశారు. ‘పారిశ్రామికవేత్తలకు తాను ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ నిబద్ధత, నిజాయితీ. ఇవి తన దగ్గర ఉన్నాయి. ఏదైతే చెబుతానో.. వాటిని కచ్చితంగా చేసి తీరుతా.. అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

 

 

ఇదే సమయంలో జగన్ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మనం ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని ఆ మాటలే నేను మాట్లాడితే విలువ ఉండదు. గత ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టారని విమర్శించారు.

 

 

 

చంద్రబాబు ప్రభుత్వం నెలకో విదేశీ పర్యటనల హడావిడి చేసిందని.... రూ.50 వేల కోట్లతో సెమీకండక్టర్‌ పార్కును నెక్ట్‌ హార్బిట్‌ ఏర్పాటు చేస్తుందని ఒక రోజు.. ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని ఒకరోజు.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తుందని ఒక రోజు.. బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తుందని మరో రోజు.. హైపర్‌లూప్‌ వచ్చేస్తుందని మరోరోజు హడావిడి చేశారని గుర్తు చేశారు. అంతే కాదు.. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో దివాళా తీసిన బీ.ఆర్‌.శెట్టి.. ఈ పక్కనే 1500 పడకల ఆస్పత్రి కోసం రూ. 6 వేల కోట్లతో దిగుతున్నాడని ఇలాంటి అబద్ధాలు, గ్రాఫిక్స్‌ చెప్పారు.. చూపించారని ఎండగట్టారు.

 

 

ఇలాంటి మాటలు తాను కూడా చెప్పడం మొదలుపెడితే ఎక్కడా న్యాయం అనేది ఉండదన్నారు జగన్. గతంలో ఆశ్చర్యం కలిగించే మాటలు.. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా చెప్పుకునేవారు... టాప్‌ 1, 2, 3 స్థానంలో మన రాష్ట్రం ఉందని గొప్పగా చెప్పుకునేవారు. కానీ తాను చేతల మనిషినని... చెప్పిందే చేస్తానని కుండబద్దలు కొట్టేశారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: