జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలకు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ భుజాలు తడుముకున్నారా...? హైదరాబాద్ లో పవన్ ఇచ్చిన స్పీచ్ ఢిల్లీని తాకిందా..? పొలిటికల్ పిచ్ పై పర్సనల్ వార్ జరగబోతోందా..? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తన పెళ్లిపై ఎట్టకేలకు స్పందించారు. తనకు సరైన అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు..ఇన్నాళ్లూ మ్యారేజ్ విషయంలో కామ్ గా ఉన్న రాహుల్ ఒక్కసారిగా ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడని అంతా అనుకుంటున్నారు. రీసెంట్ గా పవన్ తన స్పీచ్ లో బ్రహ్మచారుల ప్రస్థావన తీసుకొచ్చారు. అది కూడా రాహుల్ గాంధీ పేరును పర్టిక్యులర్ గా మెన్షెన్ చేశారు...ఒక్కొక్కరి జాతకాలు బయటకి లాగుతానని మరీ చెప్పారు. దీంతో రాహుల్ తన భుజాలు తడుముకున్నాడని పొలిటికల్ గుసగుసలు వినిపిస్తున్నాయి.. పవన్ స్పీచ్ గురించి జనం ఆలోచించారో లేదో గానీ రాహుల్ గాంధీ మాత్రం బాగానే థింక్ చేసినట్టున్నారు. ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకే సరైన అమ్మాయి దొరకలేదని చెప్పాడు..౪౪ ఏళ్ల ఈ బ్రహ్మచారి ప్రస్తుతం తన ఆలోచన అంతా పొలిటికల్ లైఫ్ మీదనే ఉందని...పర్సనల్ లైఫ్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని అన్నాడు. మూగ జీవులను ప్రేమించడం, జియోగ్రఫీ, పొలిటికల్ అఫైర్స్...ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్ , చైనాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో మునిగిపోతానని అంటున్నాడు. ఐతే రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ జనాలకు ఇచ్చాడా...లేక పవన్ కల్యాణ్ కు ఇచ్చాడా అని కొందరు నేతలు అనుకుంటున్నారు. పవన్ కు అంత సీన్ లేదని, రాహుల్ కు ఏ విషయంలోనూ సరి రాడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి రాహుల్ కు సరైన అమ్మాయి దొరికేదెప్పుడు....ఇటలీ మేడమ్ ఇంట్లో పెళ్లి భోజనం చేసేదెప్పుడు అని కాంగ్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: