ప్రపంచాన్ని కరోనా చుట్టేసుడేందో కానీ ప్రజల జీవితాలన్ని అస్తవ్యస్తంగా మారాయి.. ఎవరి కష్టాలను ఎవరు పట్టించుకునే స్దితిలో లేరు.. ఇక లాక్‌డౌన్ నేపధ్యంలో వలస కూలీలు పడుతున్న కష్టాలు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టించక మానవు.. కరోనా వల్ల పోయే ప్రాణాలు ఒకవైపు, కన్న ఊరును చేరుకోవాలని ప్రయాణాలు సాగిస్తున్న వలస కూలీల మరణాలు మరోవైపు.. ఇప్పటికే ఎందరో దాతలు తమవంతు సాయంగా చేయుతనిస్తున్నారు..

 

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ గడువును పెంచుతున్నట్లుగా రైల్వేశాఖ ప్రకటించింది. ఇకపోతే 30 ప్రత్యేక రాజధాని తరహా రైళ్లు, 200 ప్రత్యేక మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా ఇప్పుడు దాన్ని 120 రోజులకు పెంచింది. మే 12వ తేదీ నుంచి తిరిగే 30 ప్రత్యేక రాజధాని తరహ రైళ్లు, 200 ప్యాసింజర్ ట్రైన్స్‌కు ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది.. అంతేకాక రైల్వేశాఖ ఈ రైళ్లలో పార్శిల్స్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

ఇకపోతే జూన్ 1 నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు తిరగనున్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లకు సంబంధించి టికెట్ బుకింగ్ ఈ నెల 21 నుంచే ప్రారంభమైంది. కేవలం రిజర్వేషన్ బోగీలతో మాత్రమే ఈ రైళ్లు నడవనున్నాయి. కాగా టికెట్ కన్ఫామ్ అయిన వారిని మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.. మరో విషయం ఏంటంటే  ఈ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ఐతే ఆన్‌లైన్‌లోనే జనరల్ బోగీల టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ (2s) చార్జీలను వసూలు చేస్తారు. ఈ రైళ్ల బుకింగ్స్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉటుంది. రైలు ప్రయాణికులంతా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP)ని తప్పని సరిగ్గా పాటించాల్సి ఉంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: