దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా విజృంభణతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల సామాన్యులు, పేదలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. కరోనా కష్ట కాలంలో పేదలకు సహాయసహకారాలు అందించేందుకు కేంద్రం భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి సఖి పథకాన్ని ప్రారంభించింది. 
 
ప్రభుత్వం ఈ పథకం సహాయంతో బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పథకం అమలవుతోంది. త్వరలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. కేవలం మహిళల కోసమే రూపొందించిన ఈ పథకం ద్వారా మహిళకు నెలకు 4000 రూపాయల వేతనం లభిస్తుంది. 
 
బ్యాంకింగ్ కరస్పాండెంట్ లేదా బీసీ సఖి యోజన పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సేవలను అందించాలని కేంద్రం భావిస్తోంది. తొలి దశలో ఈ పథకం కింద కేంద్రం 58,000 ఉద్యోగాలను కల్పించనుంది. ఈ పథకం కోసం పని చేసే మహిళలు ప్రభుత్వం నడుపుతున్న పథకాలు, బ్యాంకింగ్ సౌకర్యాల గురించి వివరించాల్సి ఉంటుంది. గ్రామస్తుల బ్యాంకులకి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా ఉద్యోగానికి ఎంపికైన మహిళలే చేయాల్సి ఉంటుంది. 
 
ప్రతి నెలా కేంద్రం ఇచ్చే 4000 రూపాయల వేతనంతో పాటు బ్యాంకుల నుంచి కూడా వీరికి కమిషన్ అందుతుంది. మహిళలు ఈ పథకం ద్వారా ఇంటి దగ్గర నుంచి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్రం ఈ ఉద్యోగాల దరఖాస్తుకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనుంది. సఖి పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ పథకం ద్వారా మహిళలు ఇంటినుంచే సులభంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: