ఆయనో ఐపీఎస్ అధికారి. తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్. కానీ.. అయితే అంత సీనియర్ అయినా ఆయనకు డీజీపీగా పని చేసే అవకాశం దక్కలేదంటున్నారాయన. తన సీనియార్టీకి ఆ పోస్టు కచ్చితంగా వచ్చి తీరాలని ఆయన నమ్ముతున్నారు. ఆయనే వీకే సింగ్. ఆయన ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ ( టీ ఎస్‌ పీ ఏ ) కు డైరెక్టర్‌గా ఉన్నారు.

 

 

అయితే, గియితే డీజీపీగానే రిటైర్ అవ్వాలనుకుంటున్న వీకే సింగ్.. ఇప్పుడు గళం విప్పారు. తన రిటైర్‌ మెంట్ దగ్గర పడిన నేపథ్యంలో సర్కారుకు తన గళం వినిపించాలను కుంటున్నారు. అందుకే.. ఏకంగా తనకు ప్రమోషన్ ఇవ్వకపోతే రాజీనామా చేసి వెళ్లిపోతానని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఒక ఐపిఎస్ అధికారి ఇలా ప్రకటించడం చాలా అరుదు అనే చెప్పాలి.

 

 

అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ వీకే సింగ్ పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ కు డైరెక్టర్‌గా ఉన్న వీకే సింగ్‌ ప్రస్తుతం ఏడీజీ హోదాలో ఉన్నారు. ఈనెల 21న చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి.. దాని కాపీ సీఎంకు కూడా పంపించారు.

 

 

ఇక వీకే సింగ్ వివరాల్లోకి వెళ్తే.. ఆయన 1987 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయనకు ఐపీఎస్ గా 33 ఏళ్ల సీనియారిటీ ఉంది. తాను ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం ఎంప్యానెల్‌ అయ్యానని కూడా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని... తనకు డీజీపీ పోస్టు ఇవ్వాల్సిందే అంటున్నారాయన. మరి వీకే సింగ్ లేఖపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే డీజీపీగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం అభీష్టం ప్రకారమే జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: