ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం  జనాలపై ఎంతగానో పెరిగి పోయిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకుమించిన చెడు కూడా జరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రభుత్వానిపై  కూడా ప్రజలకు నమ్మకం పోగొట్టే విధంగా సోషల్ మీడియా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా వైరల్ చేయడంలో సోషల్ మీడియా ముందు ఉంటుంది. తప్పుడు సమాచారాన్ని ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు అని అధికారులు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ రోజురోజుకు సోషల్ మీడియా ప్రభావం మాత్రం పెరిగిపోతూనే ఉంది. 

 


 ముఖ్యంగా చాలాసార్లు పోలీసులు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను అరికట్టడానికి ఎన్నో చర్యలు చేపట్టారు. పోలీసులు చర్యలు చేపట్టిన సమయంలో కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ఈ తప్పుడు వార్తలు తగ్గినప్పటికీ ఆ తర్వాత మళ్లీ జోరందుకుంటాయి.  ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలని తప్పుబట్టే విధంగా సోషల్ మీడియా లో జరిగే ప్రచారంపై ప్రభుత్వాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు అటు ప్రభుత్వాలు కూడా నడుంబిగించిన విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా ముంబై పోలీసు ఉన్నతాధికారి ప్రణయ్ అశోక్ సోషల్ మీడియా వేదికగా వచ్చే విమర్శల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో  ప్రభుత్వంపై విమర్శలు నిషేధించాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యల పై ప్రజల నమ్మకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం అరికట్టడం  కోసం ముంబై పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: