దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలలో మహరాష్ట్రం ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపుగా 50 వేలకు పైగా కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉండడం గమనార్హం. దీంతో మహారాష్ట్ర ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని దినదినగండంగా బతుకును వెళ్లదీస్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది... ఓవైపు సరైన ఉపాధి దొరక్క...  కుటుంబ పోషణ భారం అవుతూ ఉంటే మరోవైపు కరోనా  వైరస్ తో పోరాటం చేయవలసి వస్తుంది. అదేసమయంలో ప్రస్తుతం సామాన్య ప్రజలను నీటి సమస్య కూడా వెంటాడుతోంది. మహారాష్ట్రలోని చాలామంది ప్రజలు నీటి  సమస్యలతో అల్లాడుతున్నారు. 

 

 ఇక కొన్ని గ్రామాల ప్రజలు అయితే గుక్కెడు నీటి కోసం ఏకంగా కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యం బాగాలేకపోయినా... దాహం తీరాలి అంటే... గొంతు తడవాలి అంటే... నిత్యావసరాలకు నీరు కావాలి అంటే ఏకంగా కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. దీంతో చాలా మంది ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీటిని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి అందరి హృదయాలను కలచివేస్తోంది. 

 


 ఇక్కడ గ్రామస్తులు ఏకంగా నీటి కోసం పది కిలోమీటర్లు నడవాల్సినా దుస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ తహసిల్ లోని బావి నుంచి నీరు తీసుకురావడానికి గాన్ వాడి గ్రామస్తులు ఏకంగా  ప్రతిరోజు పది కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి అతి సమీపంలో ఉన్న బావి ఇది  ఒక్కటేనని... దీంతో తమకు నీటికోసం ఈ ఒక్క బావి తప్ప వేరే మార్గమే లేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం స్పందించి మా బాధలను అర్థం చేసుకుని నీటి వసతి కల్పించాలి అంటూ కోరుతున్నారు సదరు గ్రామస్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: