తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం జలాలు సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని చేరుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం జలాలు చేరగా.... 518 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు, వింతలు విశేషాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కో ఆర్డీనేటర్ వై సతీష్ రెడ్డి సోషల్ మీడియాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలను షేర్ చేశారు. ప్రపంచంలో అతి పెద్ద మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం వల్ల 20 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 
 
తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. 19 పంప్ హౌస్ లతో, 20 రిజర్వాయర్లతో, 3 బ్యారేజీలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. 
 
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రత్యేకతలు : 
 
గ్రావిటీ ప్రెషర్‌ కాలువ పొడవు 1,531 కిలోమీటర్లు 
 
టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు 
 
లక్ష్మీ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 16.17 టీఎంసీలు 
 
నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కిలోమీటర్లు 
 
అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు 
 
అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19 
 
నూతన జలాశయాల నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు 

139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పంపులు 
 
గోదావరి నీటిని 100 మీటర్ల నుంచి 620 మీటర్ల వరకు పంప్ చేసే సామర్థ్యం 
 
ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం 237 టీఎంసీలు 
 
141 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో ఆన్ లైన్ జలాశయాలు నింపుకునే ఛాన్స్ 
 
15 గేట్లు 


 

మరింత సమాచారం తెలుసుకోండి: