తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదన్న కోపంతో ఒక వ్యక్తి ఏకంగా దుకాణానికి మంట పెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులోని మదురై జిల్లా నాగమలై సమీపంలోని అచ్చంబత్తు ప్రాంతంలో చెందిన భూమి నాదం స్థానికంగా టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే బుధవారం నాడు ఆ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి అక్కడి స్థానికులు మంటలు ఆర్పడంలో సహాయం చేశారు. వారిలో గుణశేఖర్ అనే వ్యక్తి కూడా మంటలు ఆర్పడంలో సహాయం చేశాడు. 

IHG's western suburb of ...

ఈ సంఘటనపై భూమి నాదం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో ఏర్పాటు చేశారు. అయితే ఆ సీసీ కెమెరాలను పరిశీలించగా పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఇకపోతే ఆ దుకాణానికి ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు అన్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. దీనితో ఆ ఫోటేజ్ దృష్ట్యా విచారణ మొదలు పెట్టారు. ఇక చివరికి ఆ నిప్పు పెట్టిన వ్యక్తి స్థానికంగా ఉండే గుణశేఖర్ అనే వ్యక్తి గా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

 


ఆ తర్వాత ఇక ఎందుకు ఇలా చేసావు అని అతనిని విచారించగా, భూమి నాదం తనకు సిగరెట్ అప్పుగా ఇవ్వలేదన్న కోపంతోనే టీ దుకాణానికి నిప్పు పెట్టినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సదరు వ్యక్తి పై ఇంతకు ముందే అనేక కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటివారి వల్ల అనేకమంది బాధపడుతుంటారు. మరికొందరివల్ల అయితే వేరొకరి ప్రాణాలకు హాని కూడా కలగవచ్చు. ఇలాంటి వారిని శాశ్వతంగా జైల్ లో ఉంచుతే కానీ దేశం ముందుకు వెళ్ళదు.

మరింత సమాచారం తెలుసుకోండి: