ఎవరైనా చేసే చిన్న సహాయం అయినా కూడా ఎదుటి వారికి ఎంతో ఆసక్తి రేపుతోంది. మనం చేసే ఆ చిన్న సహాయం మన మంచితనానికి నిదర్శనం మాత్రమే. చేసే చిన్న సహాయంకి ఎటువంటి స్వార్థం లేకుండా చేసే పని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇలాంటి సంఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి వీధి పిల్లికి సహాయం చేసే వీడియో... తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

 

దీనితో ఆ వ్యక్తి మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు అని ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. ఒక పిల్లి దాహంతో ఇబ్బంది పడుతున్న సంఘటన చూసి ఒక వ్యక్తి తన చేతుల తో నీళ్ళు పట్టి.. ఆ పిల్లి దాహాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని IFS అధికారి సుశాంత్ నంద ట్విట్టర్ వేదికగా చేసుకొని వీడియోను షేర్ చేయడం జరిగింది. ఈ విషయానికి ఆయన స్పందిస్తూ నిజమైన సంతోషం చిన్నచిన్న విషయాల్లోనే వస్తుంది. విధి పిల్లికి నీళ్లు తాగించడం ద్వారా అతడి స్వచ్ఛమైన ఆనందం లభించింది.. అంటూ ఆయన తెలియజేశారు.


ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోని ఇప్పటివరకు వేలకొద్దీ వీక్షకులు రీట్వీట్ లతో దూసుకుపోతుంది. వీడియోని కొందరు నెటిజన్లు మానవత్వాని చూడటం గర్వంగా ఉంది అంటూ... మరోవైపు అతను ఎంతో దయగలవాడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోలో దాహంతో ఇబ్బంది పడుతున్న పిల్లికి ఒక వ్యక్తి కొళాయి నీళ్లలో తన చేతిలో పెట్టి తాగించడం జరిగింది. అలాగే పిల్లి కూడా అతన్ని చూసి భయపడకుండా తన దాహం తీర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: