తెలంగాణ అపరభగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అని అందరికీ తెలిసిందే.  కానీ ఇప్పుడు ఆ పేరుకి కొత్త నిర్వచనం చెప్పారు.. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్.  KCRలో K అంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని అర్థమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రైతును రాజుగా చేయాలి అన్న తపతనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు పనులపై ఎక్కువ దృష్టి పెట్టారు.  తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు.   ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

IHG

గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు కేసీఆర్. దాన్ని ఓ యజ్ఞంలా భావించి కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయించారు.  ఇందులో భాగంగా గోదావరి జలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు.  ఈరోజు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు 82 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంప్ చేయడానికి కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేసిన సంగతి తెలిసిందే.

IHG

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజుక్టును నిర్మించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 2.85 ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందని చెప్పారు.  త్వరలోనే ప్రారంభం అయ్యే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.   దూరదృష్టితో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేవిధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: