పండుగ.. పెళ్లి.. ఉత్సవమేదైనా వారికి ఆభరణమే ప్రధాన అలంకరణ. అదే ఇప్పుడు మన మహిళను స్పెషల్ కేటగిరీలో చేరుస్తోంది. ఇండియాలో 60 శాతం నారీమణులు గోల్డ్ క్యాటగిరీలో ఉన్నారని, మిగిలిన వారిలో 37 శాతం మంది భవిష్యత్తులో గోల్డ్‌ కొనాలనుకుంటున్నారని తెలిపింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. 

 

భారతీయులు బంగారం ప్రియులు. ముఖ్యంగా మన మహిళలకు నగలపై మోజెక్కువే. అది ఎంతగా అంటే ఇండియాలోని మహిళల వద్దే ఎక్కువ బంగారముందని ప్రపంచం చెప్పేంతలా..! .

 

ఇండియాలో ఉన్న నారిమణుల్లో అరవై శాతం మంది బంగారు ఆభరణాలు కలిగి ఉన్నట్టు రిపోర్టును వెల్లడించింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. మరోవైపు.. వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. మన దేశంలోని 37 శాతం మంది ఇంత వరకు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయలేదట. కాకపోతే, భవిష్యత్తులో వారు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారని రిపోర్టులో తెలిపింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఈ 37 శాతం మంది మహిళలు కొనుగోలు సామర్థ్యంతో ఉన్నా.. బంగారం ఆభరణాల పరిశ్రమకు వారు కొత్త వినియోగదారులు కానున్నారు.

 

అయితే ప్రస్తుతం బంగారం ఉన్న వారిలో 44 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా.., 30 శాతం మంది పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారని నివేదికలో తెలిపింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. మన దేశ మహిళలకు బంగారం ఆభరణాలు మొదటి ప్రాధాన్యమని తెలిపింది. బంగారం మన్నిౖకైనదే కాకుండా, చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపదంటూ.. మహిళలకు ఇది చక్కని ఎంపిక అంటూ తెలిపింది సర్వే. అయితే, నేటి యువ మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతుందని తెలిపింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఇక 18 నుంచి 24 ఏళ్ల వయసున్న భారతీయ మహిళలలో 33 శాతం మంది గడిచిన ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు తెలిపింది డబ్ల్యూజీసీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: