వైసీపీ సర్కార్ కి హైకోర్టు లో గట్టి దెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తప్పిస్తూ తెచ్చిన 213 ఆర్డినెన్స్ ను రెండు జీవోలను కూడా హై కోర్టు కొట్టేస్తూ సంచలన తీర్పు చెప్పింది. దీంతో వైసీపీ సర్కార్ ఇపుడు నిమ్మగడ్డను మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాల్సివచ్చింది.

 

ఇదిలా ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కులం గోత్రం ఇప్పటికే వైసీపీ నేతలు చర్చకు పెట్టారు. ఆయన టీడీపీకి అనుకూలం అని కూడా ఆరోపణలు చేశారు. ఇక ఇపుడు అదే నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా ఉంటే విపక్షానికి రెక్కలు వస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా కూడా వైసీపీకి విపక్షం పరిస్థితి దాపురిస్తుందని కూడా అంటున్నారు.

 

ఇక ఏపీలో చాలా చోట్ల లోకల్ బాడీ  ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. మరి వాటి వైషయం ఏంటి అన్నది ఇపుడు చర్చగా ఉంది. నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖలో ఇన్ని ఏకగ్రీవాలు ఎపుడూ చూడలేదని అన్నారు. ఎన్నికలు సజాబుగా జరగడంలేదని ఆయన పరోక్షంగా అభిప్రాయపడినట్లుగా ఉంది.

 

అయితే మార్చి 15న నిమ్మగడ్డ ఎన్నికలను హఠాత్తుగా ఆరు వారాలకు వాయిదా వేశారు. అప్పట్లో ఆయన చెప్పిన మాటలు చూస్తూంటే ఎన్నికలు ఇప్పటివరకూ జరిగిన ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన షెడ్యూల్ యధావిధిగా సాగుతుందని. కానీ ఆ తరువాత రాజకీయ రచ్చ సాగడంతో నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాయడం జరిగింది.

 

ఆ తరువాత ఆయన్ని తొలగించారు. ఇపుడు హైకోర్టు మళ్ళీ ఆయనకే పదవి కట్టబెట్టింది. ఇవన్నీ చూసుకున్నపుడు నిమ్మగడ్డ మొత్తం ఎన్నికల షెడ్యూల్ ఫ్రెష్ గా నోటిఫికేషన్ తో జారీ చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇది విపక్షాల ప్రధాన  డిమాండ్ కూడా. మరి అదే కనుక జరిగితే వైసీపీకి మరింత దెబ్బ అవుతుంది. 

 

భారీ ఎత్తున ఏకగ్రీవాలు ఆ పార్టీ పరం అయ్యాయి. ఇపుడు మళ్ళీ మొదటి నుంచి అంటే వైసీపీకి మెజారిటీలు తగ్గిపోతాయి. ఈ మధ్యలో మారినరాజకీయ  పరిణామాలు కూడా విపక్షానికి బాగా కలసిరావచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: