సాధారణంగా భారత దేశంలో ఓ సామెత ఉంది.. మనం వెళ్లాలనుకునే రైలు గంట లేటు అంటుంటారు.. అచ్చం అలాగే ఉంది.. ఓ ప్రోడెక్ట్ ఆర్డర్ విధానం.  కాకపోతే ఇది గంట కాదు.. ఏకంగా ఏనిమిది సంవత్సరాలు లేటు.  ఓ వ్యక్తి తన తలుపు తెరువగానే కాళ్లవద్ద ఓ పార్శిల్ కనిపించింది.  అయితే అన్నీ కరెక్ట్ ఉన్నాయి.. తన అడ్రస్, పేరు, ఫోన్‌ నెంబర్‌ ఇతనిదే కానీ ఒక్క విషయం మాత్రం ఆ వ్యక్తికి అస్సలు గుర్తుకు రావడం లేదు.. ఈ ఆర్డర్ నేనెప్పుడు చేశానా? ఇలా ఆలోచించుకుంటూ చాలా సేపటికి గుర్తుకు వచ్చి షాక్ తిన్నాడు.  అసలు విషయానికి వస్తే.. టొరంటోకు చెందిన డాక్టర్‌ ఎల్లియాట్‌ బెరిన్‌స్టేయిన్ 2012లో అతను well.ca ద్వారా ఓ హెయిర్‌ క్రీమ్‌ను ఆర్డర్‌ చేశాడు. 

 

ఆ తర్వాత ఆ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ కెనడా పోస్టు ద్వారా ప్రొడక్ట్‌ను పంపింది. అయితే, కెనడా పోస్టు దాన్ని వెంటనే అతనికి డెలివరీ చేయలేదు. ఏ సమస్య వచ్చిందో ఏమో వారి వద్దే ఆగిపోయింది. చాలా ఏళ్ల తర్వాత దానికిమోక్షం వచ్చింది. ఇటీవల డాక్టర్‌కు డెలివరీ చేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే ఆ ప్రాడెక్ట్ లో వచ్చిన క్రీమ్ సాదారణంగా తెలుపు రంగులో ఉంటుంది.. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రొడెక్ట్ డేట్  ఇక్స్‌పైరీ అయిపోవడంతో పసుపు రంగులోకి మారింది.

 

‘పార్శిల్ డెలివరీ చేయకుండా వదిలేసిన ఈ ప్రాడక్ట్‌ను ఇంన్నేండ్ల తర్వాత నాకు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు’ అంటూ ఆ ప్రాడక్ట్‌ సంస్థ, డెలివరీ సంస్థలను లింక్‌ చేశాడు. దీనిపై ప్రాడక్ట్‌ సంస్థ క్షమాపణలు తెలియజేసింది.  మొత్తానికి ఆర్డర్ చేసిన ప్రొడెక్ట్ వచ్చింది.. కాకపోతే బాగా లేట్ అయ్యిందని ఆర్డర్ చేసిన డాక్టర్‌ ఎల్లియాట్‌ బెరిన్‌స్టేయిన్ నవ్వుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: