2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా గాని ఇంకా అధికారంలో ఉన్నామేమో అన్న భావన టీడీపీ అధినేత చంద్రబాబు కి ఆ పార్టీ నాయకులకు ఇంకా పోలేనట్టు కనిపిస్తోంది. అందుకే అధికారపార్టీ తామే అన్నట్టుగా టిడిపి వ్యవహారాలు చేస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో కామెంట్లు గట్టిగా వినబడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహారాలను నడిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ప్రతి సంఘటనను వైసిపికి ముడిపెట్టి రాజకీయంగా దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నిస్తున్నట్లు పరిణామాలు చూస్తే అర్ధం అవుతోంది. దీనికితోడు మద్దతుగా నిలుస్తున్న అనుకూల మీడియా కొన్ని వ్యవస్థలు టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఎక్కువ కవరేజ్ ఇస్తూ వైసీపీ ప్రభుత్వం పై చులకన భావం ఏర్పడే విధంగా చేయడంలో సక్సెస్ అవుతూ వస్తోంది.

 

ఈ విషయం సీరియస్ గా పరిశీలించిన వైసీపీ టీడీపీకి దిమ్మతిరిగే విధంగా చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బ సిద్ధం చేసినట్లు తాజాగా ఏపీ రాజకీయాల్లో వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కొనఊపిరితో ఉన్న ప్రతిపక్ష హోదా చంద్రబాబుకి  లేకుండా చేసేందుకు జగన్ స్కెచ్ వేసినట్లు టాక్. 23 మంది ఎమ్మెల్యేల లో ఇప్పటికే ముగ్గురు పరోక్షంగా వైసిపి కి జై కొట్టడం జరిగింది. ఆ ముగ్గురితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించిన వైసిపి తాజాగా మరో ముగ్గురితో  తో  రాజీనామా చేయిస్తే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా  పోతుంది అన్నది వైసీపీ ప్లాన్. కాగా తాజాగా ఆరుగురు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పెద్దలు ప్లాన్ ప్రకారం మెలుగుతున్నాట్లు టాక్. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే వైసీపీ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు బహిరంగంగానే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అదే విధంగా ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చేరికలు పూర్తయితే కనుక చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉండటంతో రాజకీయాలలో ఇది ఆయనకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: