తెలుగు రాజకీయాలలో పల్నాడు రాజకీయాలు చాలా కీలకం. నియోజకవర్గంపై పట్టుకోసం ఆ ప్రాంతంలో రాజకీయ ప్రత్యర్థులు కత్తులు దూసుకుంటూ కీలకంగా వ్యవహరిస్తుంటారు. గతంలో గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్నా య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వైసీపీ నాయకులతో నువ్వా నేనా అన్నట్టు గా పోరాడారు. ఏకంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ కి సవాలుచేస్తూ సరస్వతి భూముల వ్యవహారంలో భారీ రేంజ్ లో అప్పట్లో య‌ర‌ప‌తినేని పోరాడటం జరిగింది. దీంతో చంద్రబాబు సర్కార్ సరస్వతి ఫ్యాక్టరీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా వైసీపీ గురజాల నియోజకవర్గం లో గనుల నుంచి లేట‌రైట్ ను అక్రమంగా తవ్వుకుంటూ ఉన్నాడని య‌ర‌ప‌తినేని నీ టార్గెట్ చేసి అస్త్రంగా వైసిపి హైకోర్టుకు వెళ్లడంతో ఆ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

 

 ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఆ టైంలో య‌ర‌ప‌తినేని పై గట్టిగానే పోరాడింది. దీంతో హైకోర్టులో ఈ కేసు విషయంలో సీబీఐ విచారణ జరగాలని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా య‌ర‌ప‌తినేని కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లయింది. కేసు సీబీఐ దాక వెళ్లడంతో ఇంకా య‌ర‌ప‌తినేని పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అని అందరూ భావించారు. అదే విధంగా చంద్రబాబు కి పొలిటికల్ గా ఈ విషయం వల్ల డ్యామేజ్ అవుతుందని అనుకున్నారు. ఈ దెబ్బతో య‌ర‌ప‌తినేని సైలెంట్ అయిపోయారు.

 

అప్పటి వ‌ర‌కు అంతో ఇంతో వైసీపీపై విరుచుకుప‌డిన య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు స‌ర‌స్వతీ భూముల వ్యవ‌హారం తేలే వ‌ర‌కు నిద్ర పోన‌ని చెప్పిన య‌ర‌ప‌తినేని సీబీఐ ఎంక్వయిరీ అనేపాటికి సైలెంట్ అయ్యారు. ఇక‌ సీబీఐ కూడా ఈ కేసు విచార‌ణ ప్రారంభించింది. ఇదలా ఉండగా 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత టీడీపీ ఓడిపోయినా తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీ లోకి వెళ్లిన ఒక ఎంపీ తో చక్రం తిప్పి వ్యూహాత్మకంగా య‌ర‌ప‌తినేని మొదటిలో వ్యవహరించడంతో ఈ కేసు విచారణ తగ్గుముఖం పట్టింది. అయితే ఇటీవల గుంటూరు రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో త్వరలో ఈ కేసు విషయంలో సీబీఐ విచారణ కొనసాగే అవకాశం ఉందని ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: