దేశంలో మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఊహించని విధంగా బయటపడుతున్నాయి. ఎన్ని లాక్ డౌన్ లు పెంచుకుంటూ పోతున్న వైరస్ మాత్రం కంట్రోల్ అవటం లేదు. రోజురోజుకీ దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వలస కార్మికులకు అనుమతులు ఇవ్వడం తర్వాత నాలుగో దశ లాక్ డౌన్ టైం లో ఇచ్చిన ఆంక్షలు సడలింపులు వల్ల దేశంలో కరోనా వైరస్ ఊహించని విధంగా వ్యాప్తి చెందిందని నిపుణులు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు సంఖ్య నమోదు అవుతుండగా తెలంగాణలో తక్కువగానే ఉన్నాయి.

 

కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ప్రభుత్వం తక్కువగా చేస్తుందన్న విమర్శలు న్యాయస్థానం నుండి ప్రతిపక్షాల నుండి ఎదురవుతున్నాయి. అటువంటి సమయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఐసీఎంఆర్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. ఇక మరణాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలకు వైద్యులకు పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి వరకు కరోనా మరణాల సంఖ్య 59 కాగా, తెలంగాణలో ఆ సంఖ్య 67గా నమోదయ్యింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,245 కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,256. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కరోనా మరణాలు సంభవించడం ప్రజలలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఆరోగ్యం మొత్తం విషమించిన తరువాత రోగి రావడంతో కరోనా వైరస్ మరణాలు సంభవిస్తున్నాయి అన్ని ప్రభుత్వ వర్గాల్లో టాక్. మరి ఇలాంటి సమయంలోనే ముందుగానే కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తే సమస్య అక్కడిదాకా వెళ్ళలేదు కదా వ్యాధి ముందే గుర్తించడం జరుగుతుంది అని విపక్షాల వాదన. మొత్తం మీద కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవడంతో  ప్రభుత్వాలలో అదేవిధంగా ప్రజలలో ఆందోళన పెరిగిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: