ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈరోజు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సంచలన తీర్పు చెప్పింది. ఆయనను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశించడంతో పాటు ఆయన తొలగింపు ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. తాజా తీర్పుతో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. జగన్ సర్కార్ ఏపీ ఎస్ఈసీ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురాగా గవర్నర్ ఆ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేశారు. 
 
రాష్ట్ర ఎన్నిక కమిషనర్ పదవికాలం మూడేళ్లు గడచిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు ఆ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం కొట్టివేసింది. ఈరోజు హైకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికల విషయంలో రమేశ్ కుమార్ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంట్రీతో స్థానిక ఎన్నికలు గందరగోళం కాబోతున్నాయా...? అనే పశ్నలు తలెత్తుతున్నాయి. 
 
గతంలో నిమ్మగడ్డ కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశామని...ఏకగ్రీవాలను కొనసాగిస్తామని.... ఘర్షణలు జరిగిన చోట్ల కూడా ఎన్నికలను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల వాయిదా తరువాత వైసీపీ, నిమ్మగడ్డ రమేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వంపై నిమ్మగడ్డ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దృష్ట్యా వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 
 
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆయన విచక్షణధికారంతో ఏ విధంగా వ్యవహరిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమ్మగడ్డ రమేశ్ కు ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కూడా ఉంది. ఆ దిశగా నిమ్మగడ్డ రమేశ్ చేస్తే మాత్రం జగన్ సర్కార్ కు అది భారీ షాక్ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: