ఒకవైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటే.. ఒక వైపు కొంతమంది వారి ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా... మద్యానికి బానిసై కొందరు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణమైన సంఘటనలను రోజు గమనిస్తూనే ఉన్నాం. ఇక లాక్ డౌన్ కారణంతో అనేక మంది అనేక సమస్యలు ఎదుర్కొంటూ జీవనం ముందుకు కొనసాగించు కుంటున్నారు. మరోవైపు చిన్నచిన్న గొడవలకు అతి కిరాతకమైన నేరాలకు పాల్పడుతున్నారు.

 


సొంత వారు అని కూడా చూడకుండా హత్యలకు పాల్పడుతున్నారు. మద్యానికి బానిసైన తండ్రిని అతి దారుణంగా చంపేసి... వడ దెబ్బ కారణంతో మృతిచెందాడు అని నాటకమాడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంధ్ర సరిహద్దులోని ఉత్తుకోట సెండ్రాంపాళ్యానికి చెందిన క్రిట్టినన్ ఓ రైతు కూలీ. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. వారు చిరంజీవి, రజిని. ఇక ఇటీవల క్రిట్టినన్ మద్యానికి బానిసై కొడుకు డబ్బులు తీసుకున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద కొడుకు చిరంజీవి మూడు రోజుల కిందట తన తండ్రి వడదెబ్బతో మృతి చెందినట్లు పెనమలూరు పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనితో పోలీస్ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు తిరువల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది. 

 


ఇక పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా క్రిట్టినన్ ను గొంతు నులిమి చంపినట్లు తెలియడంతో అధికారులు అనుమానంతో చిరంజీవిని అదుపులోకి తీసుకొని వారి రీతిలో ప్రశ్నించడం జరిగింది. దీనితో చిరంజీవి తాను దాచుకున్న రూ. 3000 తండ్రి దొంగలించి మద్యం తాగాడు . ఈ విషయంపై మా ఇద్దరి మధ్య గొడవ ఏర్పడిందని తెలియజేశాడు. ఈ క్రమంలోనే తండ్రి మీద కోపంతో గొంతు నులిమి హత్య చేసినట్లు చిరంజీవి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసు అధికారులు చిరంజీవిని అరెస్ట్ చేసి ఉత్తుకోట కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఇక న్యాయస్థానం చిరంజీవికి రిమాండ్ విధించడంతో పోలీస్ అధికారులు పుళల్‌ సబ్ జైలుకు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: