భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా రాకాసి మిడతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేస్తూ గత కొన్ని రోజులుగా పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. మిడతలు శరీర బరువుకు మించి ఆహారం తినడంతో పాటు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మిడతలు ఒక్కరోజులోనే 35,000 మంది తినే ఆహారాన్ని తింటాయి. కష్టపడి పండించిన పంటను కళ్లముందే మిడతలు తింటూ ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
మిడతలను తరిమికొట్టే సరైన విధానాలు లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు భారీ స్పీకర్లు కలిగిన డీజే వాహనాల ద్వారా మిడతల దండును తరిమికొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారత్ లోకి మిడతల దండు ఎంటర్ అయిన తరువాత రెండు రూట్లకు చీలడంతో అధికారులు క్రిమి సంహారక మందుల ద్వారా మిడతలను ఎదుర్కొందామని ప్రయత్నిస్తున్నారు. ఆఫ్రికా నుంచి బయలుదేరిన మిడతల దండు పాక్ లోని పంట పొలాలను నాశనం చేసి రాజస్తాన్ మీదుగా భారత్ లో ప్రవేశించాయి.  
 
రైతులందరూ హైడ్రోజన్ బాంబులు భారీ స్థాయిలో నిల్వ ఉంచుకుని వాటిని పేల్చితే మిడతలు పారిపోతాయని... గుగ్గిలం, ఊలు లాంటి వాటితో పొగ వేయడం వల్ల అవి పారిపోతాయని... రైతులు ఈ సూచనలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు క్రిమిసంహారక మందులు పిచకారీ చేయించినా మిడతలు చనిపోవడం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. 
 
ఒక్కో మిడత 70 గుడ్లు పెట్టే అవకాశం ఉందని... అందువల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఒక్కో మిడత 70 గుడ్లు పెట్టడం వల్లే మిడతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని.... చనిపోతున్న మిడతల కంటే బ్రతికి ఉన్న మిడతల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు నెటిజన్లు మాత్రం మిడతలను కాల్చుకుని తినేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: