సీఎం జగన్‌కు భారీ షాక్....జగన్‌కు హైకోర్టు చెంపదెబ్బ...జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు....ఇవే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అనుకూల మీడియా రాసిన రాతలు. జగన్ తీసుకునే నిర్ణయాలకు పలుమార్లు హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చిన విషయం తెలిసిందే. సచివాలయాలకు రంగులు తొలగింపు, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత, డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగించడం, తాజాగా ఎలక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్‌ని తొలగిస్తూ..ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని కోర్టు కొట్టేయడం.

 

ఇక ఇవేగాక పలు అంశాల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే హైకోర్టు నుంచి తీర్పులు వచ్చాయి. అంటే జగన్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. వాటిని సరి చేసే పని హైకోర్టు చేసినట్లు అర్ధం. అయితే ఇలా కోర్టు తీర్పులు వస్తే జగన్ పాలన సరిగా లేదని టీడీపీ నేతలు అర్ధం చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే కోర్టులో ఎలా అయితే వ్యతిరేక తీర్పులు వస్తున్నాయో..ప్రజల్లో జగన్‌పై వ్యతిరేకిత పెరగాలి. ఇదే సమయంలో టీడీపీకి బాగా బలం పెరగాలి.

 

కానీ ఈ ఏడాది సమయంలో అలా జరిగిందా అంటే? అసలు జరగలేదనే చెప్పాలి. ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకుంటే, జగన్ 151 సీట్లు తెచ్చుకొని ప్రభుత్వంలోకి వచ్చారు. ఇక ఏడాది సమయంలో జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకిత వచ్చిన దాఖలాలు లేవు. కేవలం టీడీపీ నేతల్లో, ఓ సామాజికవర్గం వారికి మాత్రమే జగన్‌పై వ్యతిరేకిత వచ్చింది అంతే.

 

ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అవరోధాలు ఉన్నా జగన్..ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. దాదాపు 3 కోట్ల మందికిపైనే సంక్షేమ ఫలాలు అందేలా చూశారు. అందుకే హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా..ప్రజల్లో మాత్రం జగన్‌పై వ్యతిరేకిత రాలేదు. ఇక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంకా దారుణమైన పరిస్తితికి దిగజారింది తప్పా, ఈ ఏడాది సమయంలో అసలు పుంజుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: