ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  టీడీపీ కీలక నేత నారా చంద్రబాబు నాయుడు బావ.. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ సర్కార్ ఐదు సంవత్సరాలు కొనసాగదని మధ్యలోనే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను కొంతమంది కాస్త లైట్గా తీసుకున్నప్పటికీ కొంతమంది మాత్రం ఎంతో డీప్ గా  ఆలోచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఏదో ఇన్ఫర్మేషన్ ఉండడం కారణంగానే ప్రభుత్వం కూలిపోతుంది అనే వ్యాఖ్యలు చేశారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. 

 


 వాస్తవంగా అయితే రాజకీయంగా జగన్ సర్కార్ ను  ఐదు సంవత్సరాల వరకు కూల్చడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ తక్కువ మెజారిటీ ఉంటే కొంత మంది ఎమ్మెల్యేలను టిడిపి ఆకర్షించి  మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఉన్న మెజారిటీ 151 సీట్లు. దీంతో ఒకేసారి 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం అసాధ్యమైన పని అని చెప్పవచ్చు. దీంతో రాజకీయంగా అయితే జగన్ సర్కారు కూలిపోవడం అసాధ్యం. అయితే  ప్రస్తుతం టిడిపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం అటు న్యాయ స్థానాల నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుండడంతో.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోపంలో పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది. 

 


 అంతేకాకుండా ప్రస్తుతం జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ సర్కార్ చేయతలపెట్టిన అన్ని పనులకు న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయంలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగానే న్యాయస్థానాల తీర్పులు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో.. ఇంగ్లీష్ మీడియం విషయంలో న్యాయస్థానాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కొన్ని మార్పులు చేసి అదే కొనసాగిస్తుంది  అధికార పార్టీ. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వం పై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని తద్వారా జగన్ సర్కార్ కూలిపోతుందని మరో వాదన వినిపిస్తోంది. ఏదిఏమైనా ప్రస్తుత రాజకీయాల్లో మాత్రం బాలకృష్ణ వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు దారి తీస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: