ప్రైవేట్ యూనివర్సిటీలకు ధీటుగా ప్రభుత్వ యూనివర్సిటీలను తీర్చిదిద్దుతామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. యూనివర్సిటీల్లో ఉన్న బలాలు, బలహీనతలు తెలుసుకొని... వాటి బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వం ముందు పెడతామన్నారు. అందుకే వర్సిటీల సిబ్బందితో భేటీ అవుతున్నట్లు చెప్పారు.

 

మొత్తానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దుతామనడంతో విద్యాశాఖపై ఆమెక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

త్వరలో విద్యావ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని... కొత్త కరికులం, నూతన విద్యా విధానం వస్తాయన్నారు... తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు... వాటి పరిస్థితులు, బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టామని... ఇవే అంశాలపై వర్సిటీల సిబ్బందితో మాట్లాడబోతున్నట్లు చెప్పారు. వీసీల నియామకం, ఖాళీల భర్తీపై ఇప్పటికే సీఎంతో చర్చించాననీ... ఆ ప్రక్రియ ప్రారంభమైనా కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని తమిళిసై చెప్పారు. 

 

ల్యాండ్స్, ఫ్యాకల్టీ, ఖాళీలు, మౌలిక వసతులు, రీసెర్చ్ తదితర అంశాలతో కూడిన 41 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని యూనివర్సిటీలకు పంపామని... నిర్మాణాత్మక సూచనలతో యాక్షన్‌ప్లాన్‌ రూపొందించి త్వరలోనే ప్రభుత్వం ముందు పెడతామని చెప్పారు... తమిళిసై. ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయిమెంట్... ఈ త్రిబుల్ మోడ్‌లో ఎడ్యుకేషన్ ఉండాలని యూనివర్సిటీలకు సూచించినట్లు గవర్నర్‌ తెలిపారు.

 

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈసారి రాజ్ భవన్‌ను... దీపాలంకరణకు బదులు పళ్ళ మొక్కలతో అలంకరిస్తామని గవర్నర్ తెలిపారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ప్రతీకగా రాజ్ భవన్‌లో గోశాల ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. జూన్ రెండున తలసేమియా బాధితులను కలుస్తానని, అదే రోజు మధ్యాహ్నం కనెక్ట్ యువర్ ఛాన్సలర్ కార్యక్రమంలో విజేతలకు అవార్డుల ప్రదానం కార్యక్రమం ఉంటుందని తమిళిసై చెప్పారు. చూద్దాం.. రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థ ఎలా ఉండబోతోందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: