నియంత్రిత సాగు విధానం పై విపక్షాల చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పథక రచన చేసినట్లు ఆయన మాటల ద్వారా స్పష్టం అవుతోంది . నియంత్రిత సాగు విధానం లో భాగంగా ప్రభుత్వం చెప్పిన పంటలు వేసిన రైతాంగానికే , రైతు బంధు పథకాన్ని అమలు చేయనున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనపై విపక్షాల తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాన్ని చేశాయి  . రైతులు తమకు నచ్చిన పంట వేసుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేస్తున్నాయి .

 

రైతు బంధు పథకాన్ని సాకుగా చూపెడుతూ , తాము చెప్పిన పంట వేయాలని రాష్ర్త రైతాంగం పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని విపక్షాల హెచ్చరిస్తున్నారు . రైతుల పక్షాన పోరాడుతామని , నియంత్రిత సాగు విధానాన్ని రాష్ట్ర రైతాంగమంతా  వ్యతిరేకించాలని విపక్షాల కోరుతున్నాయి . నియంత్రిత సాగు విధానం పట్ల డైలమా లో ఉన్న రైతులు  కూడా  ఎక్కడ విపక్షాల వైపు మొగ్గు చూపుతారోనని అనుమానించిన కేసీర్ తన వ్యూహానికి పదను పెట్టారు . రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చేది నియంత్రిత సాగు విధానమే కానీ నియంతృత్వ సాగు విధానం కాదని పేర్కొనడం ద్వారా , రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు .

 

అంతటితో ఆగకుండా యావత్ దేశం అబ్బురపడే విధంగా రైతుల కోసం నూతన పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించి , విపక్షాలను ఆత్మ రక్షణ లో పడేశారు . రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నియంత్రిత సాగు విధానం నిర్ణయం తమకు కలిసి వస్తుందని ఇప్పటి వరకూ విపక్షాలు అంచనా వేశాయి . కానీ ముఖ్యమంత్రి తాజా ప్రకటన వల్ల రాష్ట్ర రైతాంగం కూడా ప్రభుత్వ తీసుకోబోయే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండడం విపక్షాలను అసహానికి గురి చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: